వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు : 
బాస్మతి రైస్‌ - 3 కప్పులు, 
ఉల్లికాడ తరుగు - అర కప్పు, 
(సన్నగా, పొడుగ్గా తరిగిన) క్యాప్సికం - 1, 

(రెండు నిమిషాలు ఉడికించిన) బీన్స్‌, 
క్యారెట్‌, క్యాబేజ్‌ తరుగు - 2 కప్పులు, 
వెనిగర్‌ - ముప్పావు టేబుల్‌ స్పూను, మిరియాలపొడి, 
ఉప్పు - రుచికి తగినంత, 
నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు. 
తయారుచేసే విధానం : నూనెలో ఉల్లికాడ తరుగు దోరగా వేగించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిమిషాలు వేగించాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు సోయా సాస్‌ వేసి (హై ఫ్లేమ్‌లో) బాగా కలిపి, తర్వాత సర్వ్‌ చేయాలి.

No comments:

Post a Comment