తోటకూర వడలు

కావలసిన పదార్థాలు:
 పొట్టు మినప్పప్పు - పావుకేజి, 
లేత కొయ్య తోటగూర తరుగు (ఆకులు మాత్రమే) - 2 కప్పులు, 
పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, 

ఉల్లితరుగు - 1 కప్పు, 
జీలకర్ర - 1 టీ స్పూను, 
ఉప్పు - రుచికి తగినంత, 
నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: 
మినప్పప్పుని రెండు గంటలు (మాత్రమే) నానబెట్టి వడగట్టి పప్పుని మూడు భాగాలు చేసి రెండు భాగాల్ని మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో మిగతా పప్పు, పచ్చిమిర్చి, తోటకూర, ఉల్లి తరుగులు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ, వడల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి గుల్లబారి చాలా రుచిగా ఉంటాయి (తోటకూరకు బదులుగా చేమ ఆకులతో కూడా చేసుకోవచ్చు).

No comments:

Post a Comment