రొయ్యల వేపుడు

కావలసిన పదార్థాలు:
 పెద్ద రొయ్యలు - 6, 
నిమ్మరసం - 20 మిల్లీ లీటర్లు, 
అల్లం వెల్లుల్లి పేస్టు - 20 గ్రాములు,
 నెయ్యి - 30 మిల్లీ లీటర్లు, 

కారం - 25 గ్రాములు, 
మెంతిపొడి - 15 గ్రాములు, 
మిరియాల పొడి - 5 గ్రాములు, 
ఉప్పు-రుచికి తగినంత .
తయారుచేసే విధానం:
శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి నిమ్మరసంలో పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత కారం, మెంతిపొడి, మిరియాల పొడి కూడా పట్టించి పక్కనుంచుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి సన్నని మంటపైన రొయ్యల్ని దోరగా వేగించుకొని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment