పావ్‌ బాజీ

కావలసిన పదార్థాలు:
 పావ్‌(బన్‌)లు తగినన్ని (అన్ని సూపర్‌మార్కెట్లలో పావ్‌ ప్యాకెట్స్‌ లభిస్తాయి), 
కాలీఫ్లవర్‌ -100గ్రా, 
కేరట్‌ -100గ్రా,
 పచ్చి బఠాణీలు -100గ్రా,
 క్యాప్సికమ్‌ -100గ్రా

ఉడికించిన బంగాళదుంపలు- 200 గ్రా,
 (తరిగిన) ఉల్లిపాయలు -200 గ్రా,
 (తరిగిన) టొమాటోలు- 200 గ్రా,
 అల్లం-వెల్లుల్లి ముద్ద -ఒక టేబుల్‌ స్పూను, 
కారం-అర టేబుల్‌ స్పూను, 
పావ్‌ భాజీ మసాలా -అర టేబుల్‌ స్పూను, 
మొలకెత్తిన పెసలు లేదా శనగలు - ఒకటిన్నర కప్పు, 
కొత్తిమీర -కొద్దిగా, 
ఉప్పు- తగినంత,
 నూనె -తగినంత.
తయారుచేసే విధానం:
కాలీఫ్లవర్‌, కేరట్‌ ముక్కలు, పచ్చి బఠాణీలను కలిపి కొద్ది సేపు ఉడికించాలి. మొలకెత్తిన పెసలు లేదా శనగలను ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో నూనెని వేడి చేసి అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చేవరకు వేగించాక క్యాప్సికమ్‌, టొమాటో ముక్కల్ని కూడా వేసి వేగించాలి. ఉడికించిన కాలీఫ్లవర్‌, కేరట్‌ ముక్కల్ని, బఠాణీలను వేసి బాగా కలపాలి. తర్వాత కారం, పావ్‌ భాజి మసాలా వేసి కలపాలి. ఉడికించిన బంగాళా దుంపలను ముద్దగా చేసి ఈ మిశ్రమంలో కలపాలి. ఆ తర్వాత ఉడికించిన పెసలు లేదా శనగలు, ఉప్పు వేసి బాగా కలిపి సన్నని సెగ మీద కొద్దిసేపు ఉంచి దించేయాలి. పైన కొత్తిమీర జల్లాలి. బన్స్‌తో పాటు వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment