ఉల్లి కాడల రైస్‌

కావలసిన పదార్థాలు: 
ఉల్లికాడలు - 12,
 పచ్చిబఠాణి - పావుకప్పు, 
పొడి అన్నం - 1 కప్పు, 
నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, 
పసుపు - అర టీ స్పూను, 
వాంగిబాత్‌ / సాంబారు పొడి - ఒకటిన్నర స్పూను, 

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, 
ఆవాలు - 1 టీ స్పూను,
 మినపప్పు - 1 టీ స్పూను, 
ఎండుమిర్చి - 1, 
కరివేపాకు - 4 రెబ్బలు, 
ఉప్పు - రుచికి, నేతిలో వేగించిన 
జీడిపప్పు - 10.
తయారుచేసే విధానం: ఉల్లికాడలు శుభ్రంచేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని (కొద్దిసేపు నీటిలో నానబెట్టిన) పచ్చిబఠాణి, ఉల్లికాడలు వేయాలి. ఉల్లి కాడలు తరుగు దోరగా వేగిన తర్వాత పసుపు, సాంబారు / వాంగీబాత్‌ పొడి చల్లి రెండు నిమిషాలు వేగించి ఉప్పు, అన్నం కలపాలి. చల్లబడ్డ తర్వాత నిమ్మరసం కలిపి జీడిపప్పుతో అలంకరించాలి.

No comments:

Post a Comment