వెజిటెబుల్‌ కబాబ్‌


కావలసిన పదార్థాలు: 
అరటికాయలు - 2, 
తరిగిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు,
 క్యారెట్‌ తరుగు - పావుకప్పు,
 కొత్తిమీర - 1 టీ స్పూను, 
జీలకర్ర - అర టీ స్పూను, 
ఎండుద్రాక్ష - 1 టేబుల్‌ స్పూను,
 జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు,
 గరం మసాల- పావు టీ స్పూను, 
పచ్చిమిర్చి - 2,
 నిమ్మరసం - అర టేబుల్‌ స్పూను, 
పనీర్‌ - 1 కప్పు, 
కారం - చిటికెడు, 
ఉప్పు - రుచికి తగినంత, 
చాట్‌ మసాల - చిటికెడు,
 నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: అరటికాయల్ని ఉడికించి తొక్కతీసి మెదిపి ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో మిగతా పదార్థాలతో పాటు అరటి గుజ్జుని వేసి ముద్దలా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని బుల్లెట్స్‌లా రోల్‌ చేసి నూనెలో దోరగా వేగించాలి. చాట్‌మసాల, నిమ్మరసం చల్లి, టమోటా సాస్‌తో సర్వ్‌ చేయండి.

No comments:

Post a Comment