టమోటా బీన్స్‌ పలావ్‌

కావలసిన పదార్థాలు: 
 తెల్ల బీన్స్‌ (సూపర్‌మార్కెట్స్‌లో లభ్యమవుతాయి) -150 గ్రా, 
బాస్మతి బియ్యం -2 కప్పులు, 
టొమాటొ రసం -3 కప్పులు, 
పలావు ఆకు- ఒకటి(1),

 దాల్చిన చెక్క చిన్న ముక్క, 
లవంగాలు - 2, 
యాలకులు - 2,
 నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, 
ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం:
బీన్స్‌ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వంచేసి బీన్స్‌ని పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టి నీటిని వంచేసి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న బాణలిలో నెయ్యి పోసి వేడి చేయాలి. మసాలా దినుసులన్నిటినీ వేసి బాగా వేగించాలి. తర్వాత బియ్యం వేసి మూడు నిమిషాలు వేగించాలి. బీన్స్‌ కూడా వేసిన తర్వాత టొమాటొ రసం, ఉప్పు వేసి కలపాలి. మంట తగ్గించి మూత పెట్టాలి. టొమాటొ రసం ఇగిరి, బియ్యం ఉడికేవరకు ఉంచాలి. దీనిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment